ఫాదర్ స్టాన్ స్వామి మరణం ప్రభుత్వ హత్య

ఫాదర్ స్టాన్ స్వామి తుది శ్వాస విడిచారు. వృత్తి రీత్యాక్యాథలిక్ ప్రవక్త అయిన స్టాన్ స్వామిని ప్రభుత్వ అండతోజాతీయ దర్యాప్తు సంస్థ కుట్రపూరితంగా భీమా కొరేగావ్ కేసులోఇరికించడానికి ముందు అనేక దశాబ్దాలుగా దళిత ఆదివాసిహక్కుల కోసం పోరాడారు.

84 ఏళ్ళ ఫా.స్టాన్ స్వామి 2020 అక్టోబర్ 20న అరెస్టు అయితలోజా సెంట్రల్ జైలు నిర్భంధంలో ఉన్నారు. చాలా కాలంగాపార్కిన్సన్స్ వ్యాదితో పాటు ఇతర ఆరోగ్య సమస్యలతోసతమవుతున్నారు. దాని వల్ల కనీసం మంచినీళ్ళు తాగేందుకుచేతితో గ్లాసు కూడా స్థిరంగా పట్టుకోలేని పరిస్థితి ఆయనది. ఒకచిన్న సిప్పర్ కోసం పెట్టిన అర్జీకి జైలు అధికారులుస్పందించకపోవడంతో కోర్టును ఆశ్రయిస్తే అది అందించడానికిఎన్.ఐ.ఎ కి 20 రోజులు పట్టింది. అది కూడా పౌరసమాజపునిరసనల ఒత్తిడి వల్ల ఇవ్వడం జరిగింది. యు.ఎ.పి.ఎఅభియోగాలు ఖచ్చితంగా బెయిలు తిరస్కరించేందుకుపగడ్బందిగా ఆరోపించబడ్డాయి.

సాధారణంగానే అనేక సమస్యలతో ఉన్న ఆయన ఆరోగ్యంనిర్భందం వల్ల జైలులో ఉన్న హీనమైన పరిస్థితుల వల్ల మరింతక్షీణించి చివరకు కోవిడ్ సంక్రమించేందుకు దారి తీసింది. పరిస్థిఅంత క్షీణించిన తర్వాత కాని ఆయన పెట్టుకున్న అర్జీకి బాంబేహైకోర్టు స్పందించి ఆయనను ముంబాయిలోని హోలి ఫామిలిహాస్పిటల్ కు తరలించలేదు. అప్పటి నుంచి నేటి వరకు ఆయనఅక్కడే ఉన్నారు. మే 21న బాంబే హైకోర్టు డివిజన్ బెంచ్ఆయనతో జరిపిన వీడియో కాల్ లో జడ్జితో మాట్లాడుతూ”ఎనిమిది నెలల క్రితం నా అంతట నేను తినగలిగేవాడిని, స్నానం చేయగలిగేవాడిని, కాసేపు నడవగలిగేవాడ్ని, కొంతసమయం ఏదైనా వ్రాసుకోగలిగేవాడ్ని. కాని ఇవన్ని క్రమంగాఒక్కోటిగా మాయమైపోతున్నాయి. తలోజా జైలు నన్నునడవలేని, వ్రాయలేని పరిస్థితికి తీసుకొచ్చింది. ఇప్పుడునాకొకరు తినిపిస్తే తప్ప తినలేని పరిస్థితిలో ఉన్నాను. పరోక్షంగామీకు చెప్పేదేంటంటే నా ఆరోగ్య పరిస్థితి ఇంత దిగజారడానికికారణం ఏంటో ఆలోచించమని మిమ్మల్ని కోరుతున్నాను” అన్నారు.  

​ఇప్పుడు ఫా. స్టాన్ స్వామి ఇక లేరు. మోడి-షా ప్రభుత్వంతనని విమర్శించే ఏ అసమ్మతి గళాన్నైనా జైళ్ళలోబందించేందుకు భీమా కొరేగావ్ కేసునుఉపయోగించుకుంటుంది. నేర చట్టాలను, దర్యాప్తుయంత్రాంగాన్ని రాజకీయ అసమ్మతిని చిదిమేసే ఆయుధంగాఉపయోగించుకుంటుంది. యు.ఎ.పి.ఎ సాధారణ న్యాయసూత్రాలను మరిపించి, జైలే తప్ప బెయిలు లేదు అనేనియామాన్ని అలవాటు చేసేస్తుంది. తలోజా జైలు అధికారులుకనీసం ఒక సిప్పర్ కూడా అందచేయకుండా నెల రోజుల పాటుస్టాన్ స్వామి ఆరోగ్యం క్షీణించడం కోసం ఎదురు చూస్తూఉండిపోయారు. మనం లాయర్లం అయినప్పటికీ, పౌరహక్కులను కపాడేందుకు రాజ్యాంగం తనపై పెట్టిన బాధ్యతలోకోర్టులు విఫలమవుతున్నాయని మనం ఒప్పుకోక తప్పదు. జస్టిస్ఎ.పి.షా చెప్పినట్లుగా “ప్రజాస్వామ్యం విఫలమవకుండాకాపాడగల ఏకైక వ్యవస్థే, అందుకు తోడ్పడుతుంది”. యు.ఎ.పి.ఎ చట్టం అమలు, దుర్వినియోగం అత్యంత తీవ్రస్థాయిలో జరుగుతుంది. బెయిలు ఇవ్వడానికి, పౌర సమాజహక్కుల పట్ల కోర్టులు-న్యాయ వ్యవస్థ వ్యవహరిస్తున్న తీరు  పట్లవిశ్రాంత సుప్రీం కోర్టు జడ్జిలే తీవ్ర ఆందోళనను వ్యక్తం చేశారు.

​యు.ఎ.పి.ఎ, ఇతర కౄరమైన నల్ల చట్టాలను రద్దుచేసేవరకు, నిరంకుశ కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా చేసుకునినిర్భందిస్తున్న మానవ హక్కుల నేతలను కార్యకర్తలను విడుదలచేసే వరకు పోరాడతామన్న ఆశయాన్ని మరోసారి గుర్తుచేసుకుంటూ ఫాదర్ స్టాన్ స్వామికి ఎ.ఐ.ఎల్.ఎ.జె నివాళులుఅర్పిస్తుంది.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create your website with WordPress.com
Get started
%d bloggers like this: